ఉబుసుపోక(ఉన్నదున్నట్లు): - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497
శ్రమశక్తితో
 దేశసౌభాగ్యం 
కాప్టలిస్టుల మేక వన్నె
పులి నైజం 

టచ్ మీ నాట్ 
సంబంధాలు 
సవతితల్లుల
ప్రేమాతిశయాలు

అహం అనే విత్తు 
స్వార్థపు మహావృక్షపు
మొలకేకదా!?
మొదలెల్లా పెరికివేయాలి

అపోహలు 
అనర్థాలకు కారణం 
నిజానిజాలు తెలిసేలోపే
చావుకబురులా చుట్టేస్తుంది 

నెరిసిన జుట్టుకు
రంగేసి నిగారింపు 
పెరిగిన, పటుత్వం తప్పిన
తనువుకు పైపూతేంపూ‌సేవు


కామెంట్‌లు