రైతుతో ముఖాముఖి. : B.రాంచరణ్ .-ఎనిమిదవ తరగతి .-Zphs .నర్మెట్ట-జనగామ జిల్లా

  1)నమస్కారమండి మీ పేరు ఏమిటి మీ కుటుంబ సభ్యులు ఎంతమంది?   
        
జ: నా పేరు రాచకొండ రాజు. మా ఇంటి కుటుంబం సభ్యులం 5 మందిమి . . భార్య భర్తలం .ఇద్దరు మగ పిల్లలు ఒక ఆడపిల్ల ఉన్నారు                                   
2)మీరు వ్యవసాయమే ఎప్పటినుండి చేస్తున్నారు?        
జ: మేము గత 20 సంవత్సరాలుగా వ్యవసాయం సాగు  చేస్తున్నాము.                           
3) మీరు ఏ పంట ఎక్కువ పండిస్తారు?                      
జ: మా వ్యవసాయ పంటలో వరి, మొక్కజొన్న, పత్తి కందులు పండిస్తున్నాము. కూరగాయలు మిర్చి టమాట కూడా పండిస్తున్నాము.              
4) ఇప్పటివరకు మీరు చేసిన వ్యవసాయంలో ఏ పంట  వల్ల ఎక్కువ లాభాలు వచ్చాయి? ఏ పంట వల్ల నష్టాలు వచ్చాయి?                            
జ: వ్యవసాయంలో మార్కెట్ డిమాండ్ ,వాతావరణ పరిస్థితులు లాభనష్టాలు  ఆధారపడి ఉంటాయి. మా వ్యవసాయంలో పంటల వల్ల ఎక్కువ లాభాలు వరి, మొక్కజొన్న, పత్తి మరియు కూరగాయల పంటలు, టమాటా, మిరప ఎక్కువగా లాభాలు తెచ్చి న పంటలు. నష్టాలు కలిగించే పరిస్థితులు పంటలు మార్కెట్ ధర హెచ్చుతగ్గులు. ఆశించిన ధర రాకపోతే, టమాటా మిరప, పంటలు నిల్వ సౌకర్యం లేక పోతే భారీ నష్టాలు వస్తాయి. మిరప తోటల వల్ల నష్టాలు వచ్చాయి .మిరప, తామర పురుగు పట్టి పంటను నాశనం చేశాయి. వరి పంటను పురుగులో కాండం తులుచు పురుగు, ఆకుముడుత ప్రమాదం అకాల వర్షాలు లేదా తెగుళ్ల వల్ల వరి పత్తి వంటి పంటలు కొన్నిసార్లు నష్టాలు వస్తాయి.        
5)ఇన్నేళ్ల మీ వ్యవసాయ జీవితంలో మీకు సంతోషం కలిగించిన సంఘటన ఏమిటి? బాధ కలిగించిన సంఘటన ఏమిటి?                 
జ: సంతోషం కలిగించిన సంఘటన: విత్తనం వేసిన రోజు  నుండి పెంచిన పంట చేతికి వచ్చినప్పుడు ఆ పచ్చని చేను ని చూస్తుంటే కలిగే తృప్తి అంతా ఇంతా కాదు మేము పండించిన మార్కెట్ లోఎక్కువ ధరకు అమ్ముడు పోతే అప్పుడు సంతోషం . బాధ కలిగించే సంఘటన: 2025 సంవత్సరంలో అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల పంటలను నష్టాలు కలిగించాయి ,ఎంతో కష్టపడి పండించిన పంటకు కనీసం పెట్టిన పెట్టుబడి తిరిగి రానప్పుడు రైతు తీవ్ర మనస్థాపానికి గురి అవుతాడు.                          
 6)మీరు పంట పండించే నేల ఏ రకానికి చెందినది?              
జ: పంట పండించే నేల సాధారణంగా లోమ్ నేల నల్లరేగడి నేల లేదా ఎర్ర నేల రకానికి చెందినది. నల్ల రేగడి నేల రకానికి చెందినది. పత్తి మిరప వంటి పంటలకు చాలా అనుకూలం .                                                                      
7) మీ పొలానికి నీటి వసతి ఎలా ఉన్నది?          
 జ:పొలానికి నీటి వసతి ప్రధానంగా  కాలువ నీటిపై ఆధారపడి ఉంటుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో రైతులు నీటి కుటుంబ డ్రిప్ ఇరిగేషన్ లేదా ఉపయోగిస్తూ తక్కువ నీటితో ఉండే పంటలను సాగు చేస్తారు వ్యవసాయానికి 90 శాతం భూగర్భ జలాలే ప్రధాన ఆధారం.                          8) వ్యవసాయనికి పశువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? లేక ఆధునిక యంత్రాలు ఎక్కువ ఉపయోగిస్తున్నారా?               
జ: ప్రస్తుత వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు ట్రాక్టర్ హార్వెస్టర్ వినియోగం పశువుల(ఎడ్లు కంటే  ఎక్కువ. సమయం ఆదా చేయడం కూలీల కొరత ఉత్పాదకతను పెంచడం  కోసం రైతులు యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు.
9 )

మా విద్యార్థులందరికీ మీరిచ్చే సందేశం ఏమిటి?

మీరు తినే ప్రతి మెతుకు వెనుక రైతు కష్టం ఉన్నది.ఆహార భద్రత అనేది, దేశాభివృద్ధికి పునాది.అందుకే అందరూ రైతును గౌరవించండి.
కామెంట్‌లు