తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్ వారు బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో విద్యార్థులకు నిర్వహించిన కథల పోటీలో ఎంపికైన 56 కథలతో "బాలల ప్రపంచం " అనే కథా సంకలన పుస్తకాన్ని ముద్రించింది.ఇందులో సిద్దిపేట జిల్లాలో రామంచ ఉన్నత పాఠశాల కు చెందిన 9వ తరగతి విద్యార్థి బిచ్చాల బ్లెస్సి వ్రాసిన "కల్తీ ఆహారం "కథ ఎంపిక కావడం మరియు నగదుబహుమతి కూడా రావడం సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయురాలు సత్తవ్వ అన్నారు. ఈ సందర్భంగా బ్లెస్సిని మరియు ప్రోత్సహించిన ఉపాధ్యాయులు నిర్మలను ఉపాధ్యాయులు భాస్కర,మల్లయ్య,నరేందర్, గంగాభవాణి, శ్రీనివాస్, జమున ,మరియు అమ్మాఆదర్శ కమిటి చైర్మన్, గ్రామ సర్పంచి,గారలు అభినందించారు.
అదేవిధంగా పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహించి ఎన్నికైన కథలను పుస్తరూపం తీసుకవచ్చిన పుస్తక సంపాదకులు సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలా చారి గారికి ,సంపాదక వర్గానికి హృదయ పూర్వక కృతజ్జతాభివందనాలు తెలియజేశారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి