శివుని తత్వము నెరిగి...
శివానుగ్రహమునుబొంద
శివుని ఆరాధించు సుదినము ఈ పవిత్ర మహా శివ రాత్రి....!
బ్రహ్మాండ మంతయూ...
నిండి యున్న శివుని ఆ క్రుతియే...
ఈ లింగ రూపము...
పరమ పవిత్ర మిది నిజము...!
సాకార - నిరాకార దేహ, ప్రాణముల సమన్వయ
ప్రతీక స్వరూపముగా... ఆవిర్భ వించిన తేజో మయ స్వరూపమే ఈ శివ లింగము...!
దక్ష యజ్ఞమున సచీదేవి తనకు తానుగా అగ్నికి ఆహుతై...
తిరిగి పర్వత పుత్రి పార్వతిగా...శివుని పరిణయ మాడిన దీరోజే నట...!
దేవ, దానవులు అమృతమును గోరి...
సాగర మధనము గా వింప...
తొలుత బుట్టిన హాలాహ లమునకు ప్రపంచమే భీ తిల్ల....
శివుడు తాను గ్రహించి మూర్చిల్ల...
ఆ రాత్రి యంతయూ అభి షేకములు , ప్రార్ధనల తో...
జగమంత మేల్కొన్న రోజట ఈ రోజు!
నేను గొప్పంటె... నే నే గొప్ప యనుచు...
విధాత, విష్ణువు లిరువు రూ
వాదు లాడు సమయమున...
వారిరువురి నడుమ ఆద్యంతములు గోచరించ ని అగ్నిలింగముగ అవత రించి....
వారి గర్వము సర్వము హరించినది ఈ రోజే నట !
అన్య చింతలు వీడి...
శివునితో ఉపవసించి...
దిగ జారి యున్న ప్రాణ శ క్తిని...
తిరిగి నిజ స్థానమునకు జేర్చి...
ముక్తి నొందుటకే ఈ శివ రాత్రి నియమం...!!
ఇదియే ఇందు గల మహత్యము....!
ఈ మహత్యమునెరిగి...
లబ్ధి బొందుడీ సుజను లా రా...!!
హర హర హర హర మహా దేవ...!
శివ శివ శివ శివ శంభో మహా దేవ...!!
జఠాధారి గంగా ధరా...
చ0ద్ర మౌళి , త్రినేత్ర స్వరూపా...!
త్రిశూలపాని,చర్మా0బర ధారీ...
నంది వాహనా, నాగ భూషణా...
సంగీత, సాహిత్య, నాట్యాదిసకల కళా విశార దా...!!
విభూతి ప్రదాతా, లయకరా..ఈశ్వరా...!
నమస్తే నమస్తే నమస్తే నమః...!
ఓం నమః శివాయ...!
ఓం నమః శివాయ...!!
ఓం నమః శివాయ...!!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి