పవిత్రప్రేమ: - కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖపట్నం
మనసున మనసై బ్రతుకున బ్రతుకుగా
కష్ట సుఖాలలో కలిమిలేములలో
ఒకరికొకరు తోడునీడగా అరమరికలు లేక

ఆకర్షణ ప్రేమని భావించక 
అందం అశాశ్వతమని
మనసా కర్మణా వాచా 
అనురాగ ఆప్యాయతలతో
అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా

ఎన్ని అవాంతరాలు ఎదురైనా
సమాజాన ఎవరు ఏమన్నా
ఒకరికొరకు ఒకరుగా జీవితాంతం
వృద్ధాప్యంలో కూడా ఒక్క నిమిషం 
ఎడబాటు భరించలేని నిస్వార్థ ప్రేమికులు
వసుదైకానికే ఆదర్శం...!!
..........................


కామెంట్‌లు