వింతలోకం..? విచిత్రజీవితం..?: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
విధినాటిన విత్తనం...
తొలి పరిచయం...
ఎండమావిలా భ్రమింపజేసి
మాయ...తొలి బంధం...

గుండెను పదునైన
కత్తుల్లా గాయపరిచేవి...
కసి కక్ష ద్వేషం...
కదిలే మేఘాల్లా
కనుమరుగైపోయేవి కరుణ
జాలి దయ...మమకారం...

నిర్మలమైన
నీలాకాశంలా
నిలిచేది...స్నేహం...
స్వచ్చమైన మనసున
పుష్పంలా పరిమళించేది...ప్రేమ

గాలిలో మేడలా తృటిలో
కుప్ప కూలిపోయేది...ఆశ...

విషసర్పంలా
స్నేహ ప్రేమ బంధాల్ని
కలుషితం చేసేది కాటేసేది...స్వార్థం...
అర్థంకాని మాయాజాలం...ఈలోకం...

శాశ్వతమైన వెలుగులా నీకు
నిత్యం తోడుగా నీడగా ఉండే 
నీ రక్షణ కవచం...దయగల ఆ దైవమే...

కామెంట్‌లు