కరాటే నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. శుక్రవారం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆయన పిల్లలకు కరాటే శిక్షణ తరగతులను ప్రారంభించారు. ప్రముఖ కరాటే మాస్టర్ సదానందం పిల్లలకు శిక్షణనిస్తున్నారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ కరాటే వల్ల పిల్లలు తమను తాము రక్షించుకోవడమే కాకుండా దేహదారుఢ్యం, క్రమశిక్షణ, సత్ప్రవర్తన, సమయస్ఫూర్తి పెంపొందుతుందన్నారు. పాఠశాల పిల్లలకు చదువుతోపాటు సత్ప్రవర్తన, క్రమశిక్షణ, వివిధ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదివించాలని ఆయన కోరారు. అనంతరం కరాటే మాస్టర్ సదానందం మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యవంతులుగా తయారవుతారని, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ప్రత్యేక చొరవ తీసుకొని పిల్లలకు కరాటే నేర్పిస్తున్నారన్నారు. తర్వాత ఆయన పిల్లలకు కరాటే బేసిక్స్ నేర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, కరాటే మాస్టర్ సదానందం, ఉపాధ్యాయినులు ఎడ్ల స్రవంతి, సుప్రియ, స్పెషల్ వర్కర్ విజయలక్ష్మి, తల్లిదండ్రులు, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
కరాటేతో ఆత్మవిశ్వాసం : - -- ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి