ఆనందాన్నిచ్చే జీవితం : -.. కోరాడ నరసింహా రావు
నువ్వెంత బలవంతుని వైనా... 
 ఎన్నెన్ని తెలివి తేటలు నీ కున్నా... 
  కాలం కలిసి రాకపోతె... 
నిష్ప్ర యోజనమే...! 
 నీ ప్రయత్నాలేవీ ఫలించవు !! 

ఇప్పటి నీ స్థితి గతు లన్నీ
నీ పూర్వ కర్మల ప్రభా వం తో ఏర్పడ్డవే...! 

ఇప్పటి నీ ప్రయత్నాలన్నీ నామకా...!! 

ఇదంతా... ఏ బ్రహ్మో నీ తలపై రాసిన రాతలో... 
 నీ చేతిలో గీసిన గీతలో అనుకోకు...! 

నీ కు నువ్వు దాచి పెట్టు కున్న పాప, పుణ్య ఫలా లు...!! 

ఇప్పుడిక నువ్ చెయ్య గలిగిందేమీ లేదు...! 
 అనుభవించ వలసిందే!! 

నీ తదుపరి జీవితం ఇలా కా కుండా చూసుకో ! 
  ఇప్పుడైనా... పాపాల జోలికి పోక... 
  పుణ్య చింతనతో... 
 పరోప కారి వై బ్రతుకు! 
  నీ తదుపరి జీవితం నీకు  
దుః ఖా న్ని కాక.... 
  ఆనందాన్నిస్తుంది...!! 
       *****


కామెంట్‌లు