పరమాత్ముడు ప్రసాదించిన మానవజీవితం
పెదవులపై చిరునవ్వుతో అనురాగ ఆప్యాయతలతో
సమాజాన ఉన్న ప్రజలతో మమేకమై
అసూయ ద్వేషాలతో పగ ప్రతీకారాలు లేక
ఎవరేమన్నా అనుకున్నది సాధించినపుడు
ఆశయం నెరవేరినపుడు కలిగే ఆనందం వర్ణింపతరమా.
ఏ సమస్య ఎదురైన దానికి పరిష్కారం ప్రతీకారం కాకూడదన్న
జాతిపిత మహాత్ముడు,గౌతమబుద్ధుని అడుగుజాడల్లో
నడచి
మృదు భాషణం యుక్తాయుక్త విచక్షణతో పరిష్కరించుకోవాలి
భారతంలో ప్రతీకారంతో వినాశనమైన కౌరవులు
రామాయణంలో రావణ బ్రహ్మ ఎన్నో ఎన్నెన్నో పురాణ గాధలు
నేడు దేశాల మధ్య జరుగుతున్న యుద్దాలవల్ల జరుగుతున్న మారణహోమాలు
పగలు ప్రతీకారాలు
మంటకు ఆజ్యం పోసి రగిల్చినట్లే
మానసిక అశాంతికి ప్రతీకలు...!!
..........................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి