సుప్రభాత కవిత : - బృంద
కలతల గతుకులు 
కాలికింద  జారే రాళ్లు 
విడిపోని చిక్కు ముళ్ళు
ముందరి కాళ్లకు బంధాలు...

ఎడతెగని  ప్రయత్నాలు 
ఎదురయే ఆటంకాలు 
ఇరుకున్న పెట్టే ఇడుములు 
బిగుసుకునే  బంధనాలు...

గడవక తప్పని రోజులు 
నడవక తప్పని దారులు 
విడవక తప్పని ఇష్టాలు 
చదవక  తప్పని పుటలు

బ్రతకాలనే తపనలో 
జీవించడం మరచిన క్షణాలు
అస్తిత్వపు  పోరాటంలో
చేయి జారిన అమృతాలు.

అన్ని రకాల మనసులకు 
వేకువొక్కటే  ఆధారం
రేపటిపై ఆశ లేని నాడు 
మోయలేని పెను భారమే నేడు

అరుణిమ  దాల్చిన ఆకాశానికి 
అతిథి గా వచ్చే ఆత్మీయుని
అభిమానంతో  స్వాగతించి 
అవనికి రమ్మని పిలుస్తూ....

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు