చుక్ చుక్ రైలు వస్తుంది అంటు బాల్యంలో అక్క అన్నలతో ఆడిన ఆట
అమ్మతో కలసి రాజమండ్రి వెళ్ళినపుడు రైలులో కిటికీ దగ్గర కూర్చుందుకు చెల్లితో దెబ్బలాట
పవిత్ర గోదావరి లో పదిపైసల నాణెం నమస్కరించి వేయడం
ఎక్కే వాళ్ళు ఎక్కి దిగే వాళ్ళు దిగుతు చేసే హడావిడి
కిటికీలోంచి ఆకాశంలో చూసి పున్నమి చంద్రుడు మాతో ఎలా వస్తున్నాడన్న సందేహం.
పచ్చని పైర్లు తెల్లని కొంగలు బారులు బారులుగా ఎగిరే దృశ్యాలు.
ఎన్నో ఎన్నెన్నో స్టేషన్లు వెనక్కి వెళితే చుక్ చుక్ మంటు కదిలే రైలు.
కళ్ళు లేని కబోది ఓహో ఓహో పావురమా,పయనించే ఓ చిలుకా అని పాడే పాట
అమ్మ ఇచ్చిన పావలా కాసు పేదవానికి వేస్తే దీవించడం
స్టేషన్ వచ్చిందని దిగండని అమ్మ చెపితే అప్పుడేనా అంటు దిగడం.
మామయ్య పెరట్లో బావలతో కలసి రైలు ఆట ఆడటం.
స్టేషన్ మాష్టారుగా నేను విజిల్ వేసి తాతయ్య గావంచ జెండాగా ఊపితే రైలు బయలుదేరడం.
అమ్మ, నాన్న, మామయ్య ఒక్కొక్కరుగా జీవితంలోంచి నిష్క్రమించడం
.
ఏడుపదులు దాటిన వయస్సులో నాలో నేనే అనుకున్నాను.
రైలు ప్రయాణమే జీవితం రైలు ప్రయాణమే అని ఎవరిస్టేషన్ వస్తే వారుదిగి పోవడమే...!!
.................................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి