ప్రేమ గుడ్డిది.: -సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
ప్రేమ 
గుడ్డిది కాదు 
ప్రేమ 
గుడ్డిగా పుట్టదు. 
ప్రేమ 
గుడ్డు లానే పుడుతుంది. 

గుడ్డును 
బయటి నుంచి పగలగొడితే 
పగిలిపోతుంది. 
గుడ్డును 
లోపల నుంచి పగలగొడితే 
కోడి పిల్ల పుడుతుంది.

ప్రేమ కూడా అంతే 

ప్రేమ 
బయటి నుంచి కాదు 
లోపలి నుంచే పుడుతుంది.
###############+++######₹####

బంగారం 
బలవంతుల చేతుల్లో ఉంటుంది 
ఇనుము 
సామాన్యుల చేతుల్లో ఉంటుంది 

బలవంతుల చేతుల్లో ఉండే 
బంగారం కన్నా 
సామాన్యుల చేతుల్లో ఉండే 
ఇనుమునే నేను ఇష్టపడతా!!
ప్రేమ కూడా అంతే...

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు