సామెత -129:అండ బతుకు-ముండ(విధవ) బతుకు ఒకటే
***
ఏం బతుకో అవ్వా! కన్నమ్మ కట్టాలు గా బిడ్డకే రావాల్నా? బగవంతుడికి సుత గింతన్న దయలేదు. ఎట్ల బతుకుద్ది,ఎట్ల పెంచుద్ది. కళ్ళు దెర్వని పసికూనలు. గాళ్ళని సాకాలంటే శేతుల పైసలుండాలె.ఎనకాల మంచి శెబర సవరిచ్చేటోళ్ళు ఉండాలె. గివన్ని ఇశారిత్తుంటే నాకే పుట్టెడు దుఃఖం వొత్తున్నది. అయ్యో అంటం గని ఏం శెయ్యలేత్తం అవ్వా! "
"ఎవల సంగతి శెల్లె! గంత గనం రంది జేత్తున్నవ్? ఏమైంది? కట్టాలు మన్సులకి గాక మానులకొత్తయా ఏంది? గా దేవుడు సుత ఓర్సుకునేతోళ్ళకే కట్టాల మీద కట్టాలతో పరీచ్చ బెడ్తడు? అస్లిషయం వొదిలి నేను సుత ఏందేందో మాట్లాడుతున్న. ఇంతకి ఎవరు గురించి శెల్లె?"
"గదే అవ్వా!గా నర్సన్న బిడ్డ సంగతి. పట్టుమని పది ఏండ్లు గాలె. ఇద్దరు పిలగాండ్లు.అల్లుడు గీ నడ్మల టుక్ టుక్ మోటరు మీద పోతుంటే టక్కరయ్యే. పైసలు బోయినా పానం మిగల్దాయె.
" అసలే బిడ్డ దుఃఖంల వుంటే అత్త, మావోళ్ళ సూటిపోటి మాటల్తో ఆత్తి పాత్తులల్ల అణా పైసొంతు సుత ఇవ్వను పొమ్మని ఇంట్లెనించి ఎల్లగొట్టిండ్రంట. గా ఇద్దరు కూనల్నేసుకుని పుట్టింటికి వొచ్చింది. నర్సన్న,వొదిన బతుకే గిక్కడ అస్సలు బాగలేదు.
కొడుకు కోడలు పెత్తనం శేజిక్కించుకుండ్రు. అమ్మ నాయినల్ని లెక్క జేసుడే లేదు. గాళ్ళకి యాళ్ళకింత ముద్ద పెట్టడానికే సత్తున్నరు. గియ్యాల గా ఆత్తంత తండ్రి రెక్కల కట్టం మీద సంపాయించిండన్న సోయే లేదు. గస్మంటి అమ్మ నాయినల్ని పెళ్ళాంతో కల్సి మస్తు యింసల బెడ్తున్నడంట. ఇంగ గీ నడ్మల గా బిఢ్డ వత్తే దరిద్రం సుట్టుకుందని పిల్లి మీద,ఎలక మీద బెట్టి తిట్టుడంట.
"నాయినా! గీ మాటలు పడ్కుంట బత్కలేను. నేను నా పిల్లగాండ్లు ఏ నుయ్యో గొయ్యో సూస్కుంటమని ఏడ్సిందట. గడియ సుత గాళ్ళని వొదలకుండ వొదినే,తను కల్సి కాపలా ఉంటున్నమని శెప్పిండ్రు అవ్వా!
అయ్యో గట్లనా శెల్లె! గా బిడ్డకి ఎంత కట్టమొచ్చెనేముల్లా. పావుకున్నన్ని ఏండ్లున్నయి.సంటి పోరగాండ్లు ఉన్నరు. ఎవలి అండ లేకుండా పోయింది. పాపం గా బిడ్డ బతుకు"అండ బతుకు - ముండ బతుకు ఒకటే అన్నట్లు అయ్యింది.ఒకల పంచెన శేర్తె గిట్ల అవమానం,సులకన భావం ఉండనే ఉంటది.
మనవే ఎట్లయిన గా బిడ్డకి దైర్నం శెప్పాలె. పదో పర్కో పైసల్చి, గా పానానికి మేవున్నమని బుజం తట్టాలె. మన మయిలా సంఘంలో శేర్పిచ్చి మిషన్ కుట్టు,పచ్చల్లు,వొంటలు నేర్పించాలె. లోకం గొడ్డువోలె. మంచి శెడులు అర్సుకునే మడుసులు ఉంటరని ఎరుక జెయ్యాలె. ముక తెలివి వొచ్చేదన్క మనం జెర పక్కనే ఉందాం శెల్లె."
అవునవ్వా! మంచి మాట జెప్పినవ్. పా గిప్పుడే దైర్నం జెప్పొద్దాం."
"ఇద్దరూ గా నర్సన్న ఇంటికి బొయ్యి గా బిడ్డను పల్కరించి గీ పైసలు శేతుల బెడ్తాం." అని ఇద్దరూ గా నర్సన్న ఇంటికి బొయ్యిండ్రు.
గదండీ సంగతి! "అండ బతుకు-ముండ విధవ బతుకు ఒకటే అంటే గిదే మరి. గది ఎంత కట్టంగా దుర్భరంగా ఉంటదో గిస్మంటివి జూసినప్పుడు మస్తు బాధయితది.పగోడికి సుత గిస్మంటి కట్టం రావొద్దని అనిపిస్తది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి