నరజన్మ సురులకన్నా మిన్న..
జీవులన్నీటికంటే
మనిషి జ్ఞాన సుగంధమంటిన
పుష్పం
మాటలు,మనోభావ వ్యక్తీకరణ,
చైతన్య స్పూర్తి. తన తదనంతరం
కీర్తి సుస్తిరం
చేసే మస్తిష్కానికి
అధిపతి మనిషి.
పుట్టుకకు సార్థకత కల్గించుకొనే
సామర్ధ్యం ఇన్ని గొప్పు వసతులతో పుట్టే మనిషి
పుట్టిన రోజు పుట్టెడు ఆనందం
అనుభవించాల్సి
న రోజే.
అమ్మ కడుపు
లో ముడుచుకొనిపడుకొన్న శిశువు బయటఅడుగుపెట్టే అద్భుత క్షణమది
బుద్భత ప్రాయం
ఈ జన్మ అని తెలిసినా అందరిని మై మరపించే మాయాజాల క్షణం పుట్టినరోజు.
పుట్టినరోజులు జరుపుకో.
నీవు కాలు ఈ భూమిపై పెట్టిన
దానికి ప్రత్యుపకారంగా
మానవత్వపు మంచినీటిని
మరీ మరీ తాగు.
పదిమందికి పంచు
మంచినీ పెంచు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి