నిలుపరా... నీ మాతృ భాష నిండు గౌరవము ! : - కోరాడ నరసింహా రావు.
జనని జన్మభూమి మాతృ భాష.... 
  వీటి తారువాతే... 
   ఏ వై నా....! 

ఉగ్గు పాలతో... 
  అమ్మ నేర్పిన భాష....! 
 ఆ పాలతో పా టే... 
 మనం నర నరాల లో  జీ ర్ణించుకున్న భాష... 
  మన తెలుగు భాష...!! 

యే దేశ మేగినా... 
  ఎందు కాలిడి నా... 
 పొగడరా...నీ మాతృ భా ష, తెలుగు నెపుడు...! 
నిలుపరా.... నీ ఆంధ్ర గౌర వము నెల్లపుడు....!! 

గ్రా0ధిక , వ్యావ హారిక,       మాండలికాది వివిధ రూ పా ల అలరారు అద్భుత భాష... 

ఎన్నె న్నొ సామెతలు, 
జాతీయాలతో సొంపు లీ నుతు, పద్య పరిమ  మళ ముల వెద జల్లు..... 
  మన మాతృ భాష
యైన... 
 మన తెలుగు భాష !!! 

అమ్మ లాల పోయునపు డైన... 
  బువ్వ తినిపించు నపుడైన.... 
   బజ్జో పెడుతూ జోల పాడునపుడైనా.... 
 ఆనందపు హాయి నందిం చునుగదా.... 
   మన మాతృ భాష....!! 

విషయ పరిజ్ఞానమునకైన
భావ వితరణ కైన...సరళ బోధ కైన...., 
  మాతృ భాష కన్న మిన్న యైన వేరొక భాష యేమున్నదీ జగాన....!? 

నే ర్వ వచ్చును భాష లెన్నైన...మన మాతృ భా ష , తెలుగు పిదప....!! 
       ******

కామెంట్‌లు