సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -139- అర్ద దుఖం ఆరు నెలలు -కడుపు దుఃఖం కలకాలం
****
అవ్వా! కంటికి పుట్టెడు దుఃఖంతో ,గుండె పగిలేలా ఏడుత్తున్న గా ఇద్దరాల్మొగలను సూత్తుంటే కండ్లల్ల గిర్రున నీళ్ళు తిరిగినయి అవ్వా! మన్సంత కలికలి అయ్యింది. అన్నేమోగని గిస్మంటి కట్టం పగోడికి సుత రావొధ్ధనిపిచ్చింది."
"అయ్యో?శెల్లె! ఎవలాళ్ళు? గింత దాక యిష్యం తెల్వకనే పాయె.ఏం జరిగింది?"
"గదే అవ్వా!గా చల్మయ్యన్న లేడు.గాల్ల కొడుకు పేటల ఏదో పేద్ద పేరున్న కాలేజీల పన్నెండు సద్వుతున్నడంట.గీనడ్మల సద్వుల శాన ఎన్కబడ్డడంట. చల్మయ్యన్న పీజు కట్టనీకి పోతే గీ యిష్యమంత శిలువలు పలువలు జేసి కాలేజోళ్ళుశెప్పిండ్రంట. గట్లని మావోన్ని ఏమనబాకుండ్రి అని శెప్పి వొచ్చిండంట.
"అయితే కొడుకును ఒక్క మాట సుత అన్లేదా?
లేదవ్వా"కొడుకు మనసు తెల్సినోడు గాబట్టి గక్కడ ఏమనకుండ ఇంటికి వొచ్చిండంట.
 "మొన్న పండక్కి వొచ్చినప్పుడు అన్న వదిన ఏమనకుండ మంచిగ జూస్కోని పంపిండ్రంట.
ఇంతకి ఏం జరిగింది శెల్లె? మనసుకి శాన ఆత్రంగా ఉన్నది.
 "గింతకీ గా పిలగాడైతే మంచిగుండు కద?"
 "మంచిగుంటే బాగుండవ్వా? కానీ ఆడు ఈ లోకాన్నే  బలవంతంగ ఊపిరి తీస్కొని ఇడ్సిపెట్టి పోయిండు.
 అయ్యో! కొడుకా! గట్లెట్ల జేసిండు.అమ్మ నాయిన ఏమన్లేదని శెప్పినవ్ గదా!"
 'అవునవ్వా! ఏం శెప్పలేదు గని,గాని దోత్తులెవరో అన్న బొయ్యిన యిష్యం జెప్పిండ్రంట.గట్ల తన ఇష్యం అమ్మ నాయినల్కి దెల్సిందని  మస్తు బాధ పడ్కుంట ఉండంట.పగటీలి తోటి పిల్లలు అన్నానికి బోయినప్పుడు గదిల ప్యానుకు ఉరేసుకుండంట.
అయ్యో కొడుకా!ఎంత పని చేసిండు?
'అవునవ్వా! గీ నడ్మల సద్వు యిష్యంలో వొత్తిడి బాగా ఎక్కువైందంట. పేలయితే అమ్మ నాయిన పర్వు బోతుందనీ బయపడి గీ పని జేస్కుండటవ్వా,"
 గియన్ని నీకెట్ల దెల్సినయ్ శెల్ల"
ఉరేసుకునే ముందు ఉత్తరం రాశి పెట్టిండంట.
అయ్యో శెల్లే! ఎంత పని జేసిండు.అమ్మా నాయినలకు కడుపు దుఃఖం బెట్టిండు. 'ఏలకి ఏలు లచ్చలకు లచ్చలు డబ్బులు బోతే పోయినయి. మల్లెట్లనో సంపాదించుకోవచ్చు గని పానం పోతే వొత్తదా?"
 "గందుకే "అర్థ దుఃఖం ఆరు నెలలు - కడుపు దుఃఖం కలకాలం" అన్నరు. ఏమని ఓదారుత్తం. రెక్కల్ల డొక్కల్ల అప్రూపంగ, ఒక్క మాటనకుండ పావురంగ పెంచుకున్న కొడుకు గట్ల శవమైతె ఎట్ల తట్టుకుంటరు శెల్లే! ఒక్క సారన్న అమ్మ నాయినల ప్రేమ గాడికి యాదికి రాలేదా? అప్పటికప్పుడే అన్కొని పానం తీసుకుంటుండ్రు. గట్ల ఎవ్వలు సుత జేయొద్దు శెల్లె. పేలైతే మల్ల సద్వి రాయొచ్చు.పానం పోతే వొత్తదా? నేను సుత వొత్త పా అన్కుంట శెల్లెతో బయలెల్లింది అవ్వ."
గిదండీ సంగతి. ఈ రోజుల్లో పిల్లలను సూస్తుంటే మస్తు బయమైతున్నది.అమ్మ నాయినలకు వొడవని దుఃఖం బెట్టి బోతున్నరు.ఎవ్వలూ గట్ల సేయమాకుండ్రి.బతికి సాదిచ్చుండ్రి.సచ్చి సాధిఛ్చేదేం లేదు.

కామెంట్‌లు