పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో ఘనత సాధించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల బాపూజీ కళామందిర్ లో జరిగిన శ్రీశ్రీ కళావేదిక 163వ జాతీయ శతాధిక కవిసమ్మేళనంలో ఆయన ఈ గౌరవాన్ని పొందారు. ఈ కవి సమ్మేళనంలో తిరుమలరావు కదనం కవనం శ్రీ శ్రీ అనే స్వీయ గీతాన్ని ఆలపించి సభాసదుల ప్రశంసలు పొందారు. అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక తెలుగు భాష సంస్కృతి వైభవం సాహిత్యం కళలను ప్రపంచమంతా చాటి చెప్పేలా పనిచేస్తున్న శ్రీశ్రీ కళావేదికచే సాహితీ శిరోమణి బిరుదు ప్రదానానికి తిరుమలరావు ఎంపికైనారు. అంతర్జాతీయ అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షులు జి.ఈశ్వరీ భూషణం, మీడియా ప్రతినిధి ఎస్.అమ్మూ బమ్మిడి, కార్యదర్శి టి.పార్ధసారధి తదితరుల ఆశీస్సులతో శ్రీశ్రీ కళావేదిక శ్రీకాకుళం జిల్లాశాఖ నిర్వహించిన సిక్కోలు సాహితీ సంబరం వేదికపై తిరుమలరావుకు ఘనంగా ఈ సాహితీ శిరోమణి బిరుదాంకిత సన్మానం చేశారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ కుమార్, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారులు బలివాడ మల్లేశ్వరరావు, ఎస్.తిరుమల చైతన్య, జాతీయ ప్రధాన కార్యదర్శి టి.పార్ధసారథి, బి.సి.సంక్షేమ సంస్థ కార్యదర్శి బి.ఎ.రావు, ఉత్తరాంధ్ర శాఖ అధ్యక్షులు డా.డబ్బీరు గోవిందరావు, రాష్ట్ర కార్యదర్శి డా.ముట్నూరు ఉపేంద్ర శర్మ, జిల్లా శాఖ కన్వీనర్ భోగెల ఉమామహేశ్వరరావు, అధ్యక్షులు మణిపాత్రుని నాగేశ్వరరావులు తిరుమలరావును శాలువా జ్ఞాపిక పురస్కార పత్రాలతో సాహితీ శిరోమణి బిరుదు ప్రదానం గావిస్తూ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక కార్యవర్గ సభ్యులు కుప్పిలి వెంకట రాజారావు, యిద్ది పాపయ్య, వాడాడ శ్రీనివాసరావు, ఐ.ఎన్.డి.ప్రసాదరావు, సిద్ధార్ధ శ్రీనివాస్, చాడ శ్రీనివాస్, చౌదరి శ్రీనివాస్, తాళ్లూరు విజయలక్ష్మణ్, రెడ్డి పద్మావతి, తేజా లక్ష్మి, పి.లక్ష్మణరావు, కిమ్మి సంతోష్ కుమార్, ఎస్.ఈశ్వరరావు, మోహనగాంధీ, కుప్పిలి త్రినాథరావు, పద్మనాభరాజు తదితరులు తిరుమలరావును ఘనంగా సన్మానించారు. మూడున్నర దశాబ్దాల నుండి కవనరంగంలో విశేషంగా కృషి చేస్తూ, ప్రముఖ కవిగా వెలుగొందుతున్న కుదమ తిరుమలరావుకు జాతీయస్థాయిలో సాహితీ శిరోమణి బిరుదు ప్రదానం గావిస్తూ శాలువా జ్ఞాపిక పూలమాల పురస్కార ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు. తిరుమలరావుకు సాహితీ శిరోమణి బిరుదు ప్రదానం లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి