అందాల వెలుగుతో
ముత్యంలా మెరిసే ఓ మగువా
అలలను ఆహ్వానించే తీరంలా
చిరునవ్వులు చిందించకు...
చనువు నేడు చల్లని చినుకే
రేపది వరదై ముంచేస్తుంది.
కడలి కెరటాలు
తీరాన్ని తాకితే వినోదమే
తీరం దాటితే తుఫానే
విధ్వంసమే వినాశనమే
ఈ జీవితం కూడా అంతే సుమా...
తిట్టడం తాత్కాలిక గెలుపు,
తాకడం శాశ్వతమైన మార్పు
గునపంలా గుచ్చే పచ్చినిజం
మాయని గాయాల్ని మిగిలిస్తుంది...
గుట్టుగా పలికిన సత్యం
గుండెల్లో వేర్లు వేస్తుంది
అది అగ్నిలా దహించదు
వెన్నెలై వెలుగు నిస్తుంది...
ఎవరు ఎంతగా చేరువైనా
నీ హద్దే నీకు శ్రీరామరక్ష
ఒక్క అడుగు వేసినా
లక్మణ రేఖను దాటినా
నీ నీడే నీకు శత్రువౌతుంది...
ఆపలేని ఆవేశం ఉండాలి
కాని అది ఆరని దీపం కావాలి
నిజాన్ని నిర్భయంగా చెప్పాలి
కానీ అది మనిషికి నిచ్చెన కావాలి..
జాగ్రత్త అన్నది భయం కాదు
అది జీవితానికి రక్షణ కవచం
ఏ గుండెను కోయని ఓ మంచిమాటే
ప్రతిగుండెను మేల్కొల్పే అఖండ శక్తి...
ఏలోపాలు లేనివాడు ఈలోకాన లేడు...
అందాల చంద్రునిలో సైతం మాయని
మచ్చలుంటాయి ముళ్ళురాళ్ళు విసరక
చీకట్లో మానవత్వపు దీపాల్ని వెలిగించు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి