*****
ఒరేయ్ బుడ్డోడా!ఇయ్యాల తాతీలేగా ! నేన్ జెప్పిన పని చేత్తే ఆటెంక అప్పలు జేసి పెడతా! తియ్య తియ్యని గడియారం శేతికి బెడతా! మరి గీ పని శేసి పెడ్తవా?"
" నీ యవ్వ బల్లె గియ్యాల మస్తు పనులు జేయిచ్చిండ్రు. బోలెడంత రాసుకునుడుంది. నేన్ జెయ్యను పో."
అయితే గియ్యాల జేసే అప్ప ముక్కడుగు గప్పుడు శెప్తా నీపని. తియ్య తియ్యని గడియారం అక్కకే మంచిగ శేసిపెడ్తా!"
"అవ్వా!ఒల్లెక్కంగ అన్న తీ! నువ్వేమంటవో అని గట్లన్న.గింతకి ఎవలింటికి బోవాల్నో శెప్పు.రప్పున బొయ్యేశొత్త!
మా బంగారు కొండ! జెర్ర సతాయిత్తడు గని మా మంచోడు.గా శెంబయ్య తాతింటకి బొయ్యి జెర గిద్దెడు నెయ్యి పట్కరావాల్రా? అక్కడ తాతింట్లె జాం కాయలున్నయి అడిగితే ఇత్తడు."
"వామ్మో!గా తాతింటికి అస్సలికి బోనవ్వా! అస్సలు మంచోడు గాడవ్వా! అన్ని పిచ్చి మాటలే. గాయన మాటలన్నీ తిట్లే అవ్వా!శానా సార్లు ఏవేవో అన్కుంట నా బుగ్గలు పిండి ఏడ్పిచ్చిండు".
ఇంగ నీ పని తర్వాత శెప్తగని..."
భూలచ్మీ! నువ్వు రా బిడ్డ! నువ్వు సుత రాస్కోవాల్నా ఏంది శెప్పు! తమ్ముడు అస్సలు బోనని జిద్దు చేత్తుండు. గా శంబయ్య తాతింటికెళ్ళి నెయ్యి పట్టుకొత్తవా?"*
వామ్మో!ఇంకెవలింటికన్న బోత గని అవ్వోవ్! గా తాతింటికి అస్సలికి బోను. అస్సలు అడ్గను. గా తాత మస్తు కంతిరి గాడవ్వా!ఒక్క మాట సక్కంగ రాదు."
"గిదేంది పోరగాండ్లిద్దరూ ఎన్నల్లేంది పోనని గిట్ల సతాయిత్తుండ్రు."
ఎందుకర్రా! గిట్ల జిద్దు చేత్తుండు. మీరు బోకుంటె బోకబోయిండ్రు తీ. ఇంగ నేనన్న బోత!"
బుడ్డోడు,భూలచ్మి ఇద్దరూ అవ్వ కాళ్ళకి అడ్డంబడి గాయనింటికెళ్ళి "అడ్గి తెచ్చేది లేదు అంటె పడేది" లేదవ్వా!
" ఓయ్! గిదెక్కడి ఇచ్ఛింత్రం. గా శంభయ్య కూసింత నోటి దుర్సున్నోడు అన్కున్న గని. మరీ గింత గనమా! పిల్లలే గింత బయపడ్తుండ్రు.ఇంగ పెద్దలెందుకు గాయన జోలికి పోతరు.''పిల్లలైనా పెద్దలైనా నోరు మంచిదైతేనే దగ్గరవుతరు". నోటి దురుసు ఎప్పటికైనా శేటే! గందుకేనేమో గా యింటాంకల ఎవ్వరు బోరు.కాకి సుత ఆలనట్టుంది."
"గందుకేనా అడ్గి తెచ్చేది లేదు అంటే పడేది లేదని" ముఖం మీదే శెప్పిండ్రు. జాంకాయల ఆశ సుత పన్జేయలేదు" అన్కుంట తాను సుత పోకుండా ఆగిపోయింది అవ్వ.
గదండీ! సంగతి.మన్షి నోటి దుర్సు ఎవలినైనా గట్లనే దూరం జేత్తది. "అడ్గి తెచ్చేది లేదు.అంటే పడేది లేదు "అంటే గిదే మరి. ఎవలికిచ్చే మరియాద గాళ్ళకి ఇయ్యాలే.పసోళ్ళు సుత పడనంటుర్రు. ఎంతుంటేంది రేపు రేపు గాయనకి 'దోశిత్తుల గాచారం' చాన్నే ఉన్నట్టుంది" అన్కుంట లోపలికి బోయింది అవ్వ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి