ఒకసారి పికాసో తన చిన్నతనంలో ఒక పెయింటింగ్ గీసి తన తండ్రికి చూపించాడు. అతని తండ్రి దానిని ప్రశంసిస్తూ, "అబ్బాయి, దీన్ని నలుగురూ చూసేలా ప్రదర్శించు...
ఏవైనా లోపాలు ఉంటే చూపించమని చెప్పు" అని అన్నాడు.
పికాసో తండ్రి చెప్పినట్లే చేశాడు. ఆ రోజు సాయంత్రానికి పెయింటింగ్ చూడటానికి వచ్చిన వ్యక్తులు దాదాపు వంద లోపాలను ఎత్తి చూపారు.
పికాసో పెయింటింగ్ తీసుకొని తన తండ్రితో "నేను మళ్ళీ బొమ్మలు వేయను. నేను గీసిన పెయింటింగులో చాలా లోపాలు ఉన్నాయి" అని బాధపడ్డాడు.
అయితే పికాసో తండ్రి, "వద్దు...అలా అనకు.... నువ్వు అలాటి నిర్ణయం తీసుకోకు... అదే పెయింటింగులు ఇ ప్రదర్శనకుంచి లోపాలను చెప్పండి... అంటూ ఓ కాగితం రాసి పెట్టు" అని కొడుకుకి సలహా ఇచ్చారు.
పికాసో అలాగే చేశాడు.
ఆశ్చర్యం... సాయంత్రానికి పెయింటింగ్‌లో ఎటువంటి మార్పు అవసరం లేదు... ఏ ఒక్కరూ కనీసం ఒక్క లోపమూ ఎత్తి చూపకపోగా పెయింటింగ్ బాగుందని ప్రశంసించారు.
ఆ సాయంత్రం పికాసో తండ్రి, "చూసేవా అబ్బాయి, మన లోపాలను ఎత్తి చూపడానికి వెయ్యి మంది ఉన్నప్పటికీ, వాటిని సరిదిద్దగలవారు చాలా తక్కువ మంది ఉంటారు" అని అన్నాడు.
పాబ్లో పికాసో గొప్ప స్పానిష్ చిత్రకారుడు. శిల్పి. క్యూబిస్ట్ ఉద్యమ సహ వ్యవస్థాపకుడు. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన కళాకారులలో ఒకరుగా ఖ్యాతి గడించారు. అతను గ్వెర్నికా - లెస్ డెమోయిసెల్లెస్ డి'అవిగ్నాన్ వంటి రచనలతో ప్రసిద్ధి చెందారు. పికాసోకు నలుగురు పిల్లలు.
1881లో జన్మించిన పికాసో 1973లో
91 సంవత్సరాల వయస్సులో ఫ్రాన్స్‌లో మరణించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి