ఎన్ని భాషలు నేర్చినా అమ్మభాషను మరవొద్దని ప్రముఖ పాత్రికేయులు బాల సాహిత్య కవి రచయిత తిరునగరి వేదాంతసూరి బాలలకు ఉద్భోదించారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా శనివారం ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాల తిరుమలగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మ అనే పిలుపులో కమ్మదనముందని నాన్న అనే పిలుపులో ఆప్యాయత ఉందని, ప్రతి విద్యార్థి మమ్మీ డాడీ కాకుండా అమ్మ నాన్న అనే పిలుపును అలవాటు చేసుకోవాలని విద్యార్థులను కోరారు. మన దేశంలో లేని అభిమానం పరాయి దేశంలో లభిస్తుందని, విదేశాల్లో మన భాష వినిపిస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేమని అన్నారు. ప్రతి విద్యార్థి తెలుగు భాష పట్ల మక్కువ కలిగి ఉండాలని మీకు తోచిన కథ కవిత వ్యాసం ఏదైనా రాసే ప్రయత్నం చేయాలని చెప్పారు. తాను నిర్వహించే “మొలక” అంతర్జాల పత్రిక మీ రచనలకు వేదిక అని చెప్పారు. అధ్యక్షోపన్యాసం చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు భరద్వాజ మాట్లాడుతూ మాతృభాష పై మమకారం వదలొద్దని, అమ్మ ప్రేమ వంటిదే మాతృభాష అని, ఆంగ్లం నేర్చుకోవడం తప్పనిసరి అయినప్పటికీ మాతృభాషను మాత్రం చులకన చేయొద్దని తప్పక గౌరవించాలని చెప్పారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, పద్య పఠన పోటి, కథలపోటీలు డాక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. దాదాపు 50మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయుల శాస్త్రుల శ్రీనాథ శర్మ ముఖ్య అతిథి పరిచయం గావించారు. ముఖ్య అతిథిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుష్పమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి విజయలక్ష్మీ , ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు పద్యాలు చదివి సభికులను అలరించారు.
తిరుమలగిరి బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి