నిమ్మకూరులో పుట్టి, ఎదిగే
అంచెలంచెలుగా, ఎంటీవోడు!
ఉద్యోగం మానేసి,
యత్నించే సినిమాలకు!
నటించెను సాంఘిక,
పౌరాణిక,జానపదాల్లో!
ముఖ్యమంత్రి అయ్యేను..
రాజకీయ ప్రవేశంతో!
వన్నె తెచ్చాను ఎంతో..
తెలుగు భాషకు, జాతికి!
నిర్మించెను లక్షల్లో..
ఉచిత ఇళ్ళు పేదలకు!
రద్దుచేసె శాసనమండలి,
పటేల్, పట్వారిలను!
రద్దు చేసే సినిమాల్లో..
శ్లాబ్ విధానాన్ని త్వరగా!
తెచ్చేను ఆస్తి హక్కు
చట్టాన్ని స్త్రీలందరికి!
పాతాళభైరవి, కర్ణ, లవకుశ
నర్తనశాల,గుండమ్మ కథ,
రాముడు భీముడు,
మల్లీశ్వరి లాంటి ఎన్నో
చిత్రాలు నటించి, నిర్మించి,
వహించారు దర్శకత్వం!
మన విశ్వవిఖ్యాత
నటసార్వభౌమ, నందమూరి
తారక రామారావు!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి