తుహిన బిందువులింకా
కరగనే లేదు
తొలి కిరణపు వెచ్చదనం
సోకనే లేదు
నీలి నింగి దారులు
ఎర్ర బడనే లేదు
తెలి మబ్బుల తేరులింకా
తెమలనే లేదు
గిరుల శిఖరాలు కనకపు
కిరీటం పెట్టలేదు
తరుల సొయగాలు మిసిమి
మెరుపు నలదుకోలేదు
పొగమంచు తెరలు
భువిని వీడనే లేదు
జగమంతా ఇంకా
మేలుకోనేలేదు
శాఖ లోని ఆకులన్నీ
ఈ కబురులే గుసగుసగా
గాలితో చెప్పగా విని
బోలెడు ఆశ్చర్యముగా....
రంగుల ఈకలతో
పొంగారెడు చిన్నెలతో
రకరకాల సందేహాలు
ఒకరికొకరు చెప్పుకునే
విహాంగాలకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి