తొలివెలుగు కిరణం చూసి
ఇల మురిసే వెలుగులతో
నిలబడని కాలం తెచ్చిన
కల తీరే కమ్మని వేకువగా!
చెరిగిన నవ్వుల గుర్తులు
పెరిగిన దవ్వుల దారులు
తరిగిన ప్రేమల పిలుపులు
దొరికేనా నేటి తోటలో!
కలవని దారుల పయనాలు
కలవక తప్పని తరుణాలు
తలవని తలపుగా జరిగి
నడిచేనా జంటగా కలిసి!
రాలిన ఆకుల దారులలో
వాలక తప్పని కొమ్మలపై
చేరిన గువ్వల జంటకు
నిలిచేనా ఆనందపు క్షణాలు!
నిన్నటి కలతలు తీరి
రేపటి కలలకు దారిగా
నేటి సమయం ఉండాలని
కోరేనా వేగిన హృదయం!
వేదనలెన్నున్నా
వేడుక లేకున్నా
వేకువ రావాలని
వసుధ వేచెను ఆశగా!
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి