జంట. : - \డా ప్రతాప్ కౌటిళ్యా
నీటికి పట్టు బట్టలు తొలగించి 
గాలికి అత్తరులు పూసి 
పూలకు పసుపు కుంకుమలు పెట్టి 
చెట్టుకు తాళిబొట్టు కట్టి 

ఆకాశానికి పందిరి వేసి 
నక్షత్రాలతో 
భాజా భజంత్రీలతో మేళ తాళాలతో 
ఊరేగించి 

భూమికి పచ్చని ఆకు వేసి 
భోజనం పెట్టి 
చంద్రుని కిందికి దించి దివిటీలా వెలిగించి 
మేఘాల పల్లకిలో పిల్లను కూర్చోబెట్టి 

వడగళ్ల వానతో ముత్యాల అక్షింతలు వేసి 
ఉరుములు మెరుపులతో 
ఊయలలు ఊగించి
చీకటితో తాంబూలం తినిపించి 
వెలుగుతో ఆలుమగలను కలిపి 

ఉదయ సంధ్య పొద్దుల గదుల్లో బంధించి 
సముద్రం మధ్యలో నిద్రపుచ్చి 
అలల కలల లోకంలో హంసల్లా 
 విహరించిన జంట మన ఇంటింటాకంటాం.!!!?

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం 
శ్రీ శ్రీ కళావేదిక సమన్వయకర్త.

కామెంట్‌లు