గజరాజు...గ్రామసింహాలు...!: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
ఓ మిత్రమా..! నా ప్రియ నేస్తమా
నువ్వు మరాళానివై (హంసవై) 
మనోహరంగా సాగిపోతుంటే...
ఓర్వలేని కాకిలోకం కారుకూతలు 
కూస్తుంది..! కలత చెందక సాగిపో..!

నువ్వు గజరాజువై
గంభీరంగా కదులుతుంటే..
వీధి కుక్కలు విరుచుకుపడతాయి...
భయపడక ధైర్యంగా ముందుకు సాగిపో..!

గుర్తుంచుకో..ఆ వికారపుకేకలు వీధివరకే
లక్ష్యం చేరాక....అవన్నీ అరణ్య రోదనలే.!

అందుకే...నిందల నిప్పులు కురిసినా...
విద్వేషపు బాణాలు దూసుకొచ్చినా...
భీకర హోరుగాలి నిన్ను వెనక్కి నెట్టినా..
నీ కసిని కృషినే ఆయుధంగా మలచుకో..!

సాహసమే నీ ఊపిరిగా సాగిపో...
నీ గమ్యం చేరేవరకు పరుగు ఆపకు..
నేడు నిన్ను చూసి మొరిగిన ఆ శునకాలే
రేపు నీవు విజేతవైతే నీకు జేజేలు పలికేలే
విమర్శల విషం చిమ్మిన ఆ విషనాగులే
నీ కీర్తి కిరీటానికి దాసోహమంటాయిలే...!


కామెంట్‌లు