'రచ్చపల్లి రత్నాలు' పుస్తకావిష్కరణ
  విద్యార్థుల స్వీయ రచనలతో వేసే పుస్తకాలు  వారిలో  సృజనాత్మాకతను పెంపొందించడానికి, భాష పట్ల ఆసక్తి కలిగించడానికి ఉపయోగపడుతాయని పెద్దపల్లి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డా. పి.ఎం. షేక్  అన్నారు. శుక్రవారం రోజున పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, రచ్చపల్లి ప్రాథమిక  పాఠశాల  విద్యార్థులు రాసిన "రచ్చపల్లి రత్నాలు " పుస్తకాన్ని ఆయన   ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏ.ఎం.ఓ  మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుండే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా ప్రణాళికా బద్ధంగా చదవాలని సూచించారు. పిల్లల ఊహశక్తి అపారమైనదని వారు  ఏ విషయాన్నైనా  ఆసక్తితో నేర్చుకుంటారని అందుకే వారికి చిన్న వయసులోనే  పాఠశాల పట్ల, చదువు పట్ల ఆసక్తి కలిగించేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలని అన్నారు. ప్రాథమిక పాఠశాల పిల్లలు అయినప్పటికీ చక్కని భావంతో అందమైన కవితలు రాశారని వారిని ఈ విధంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు అభినందనీయలని అన్నారు. 
    రచ్చపల్లి రత్నాలు పుస్తకంలో  20 మంది విద్యార్థుల కవితలు ఉన్నాయి.  వారి కవితలను పుస్తక రూపంలో ప్రచురించి విద్యార్థులను ప్రోత్సాహిస్తున్న  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సమాద్రాల వంశీ మొహనాచార్యులను ప్రత్యేకంగా అభినందించారు. రచ్చపల్లి రత్నాలు పుస్తకాన్ని తెలుగు ఉపాధ్యాయుడు, బాలసాహితీవేత్త కందుకూరి భాస్కర్ పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో  మండల విద్యాధికారి పోతు ప్రభాకర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రావు, గ్రామ సర్పంచ్ రజిత వెంకటేశం, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ప్రమీల,  ప్రధానోపాధ్యాయులు సమ్మయ్య, సముద్రాల వంశీ మొహనాచార్యులు, వాఖ్యత నూతి మల్లయ్య  ఉపాధ్యాయులు లక్ష్మణ్, సంపత్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌లు