లేకుంటే ఎలా రాస్తాను: - యామిజాల జగదీశ్
 ఒకసారి భగవాన్ రమణ మహర్షి
ఒక భక్తుడికి భోజనం తర్వాత "ఉల్లదు నార్పదు " అనే పాటలను వివరిస్తానని చెప్పారు
తీరా ఈ విషయం తెలిసి అందరూ భోజనాలు కానిచ్చుకుని పాత హాలులో గుమికూడారు.
భగవాన్ ఉల్లదు నార్పదు
పాటలను వివరించడం ప్రారంభించారు.
ఇరవై ఒకటవ పాటను వివరిస్తూ, ఆయన "దేవుడిని చూడటం అంటే దేవుడిగా ఉండటమే" అని అన్నారు.
అప్పుడు అక్కడ ఉన్న వారిలో దండపాణి స్వామి, "భగవాన్! తమ సొంత అనుభవం నుండి ఇలా చెబుతున్నారా?" అని అడిగారు.
అంతట రమణులవారు గంభీరంగా, "లేకుంటే అంతే ధైర్యంగా ఎలా రాస్తాను?" అన్నారు.
భగవాన్ శ్రీ రమణ మహర్షి అద్వైత వేదాంత సారాన్ని ఆవిష్కరించినదే ఈ ఉల్లదు నార్పదు పాటల పుస్తకం. ఇది 1928 లో రాసినది. వాస్తవికత లేదా ఆత్మ తత్వం గురించి 40 పాటలు అనుబంధంగా మరో 40 పాటలు ఉన్నాయి. ఈ పుస్తకం "నానార్" అని పిలువబడే ఆత్మ విచారణ సారాంశాన్ని, ప్రపంచం, జీవితం, దేవుని నిజమైన స్థితిని వివరిస్తుంది. 
ఇందులో ముఖ్యంగా నలభై అంశాలున్నాయి.
నిజమైన ఉనికి (ఉనికి/వాస్తవం) ఏమిటో తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
రమణులవారు తన శిష్యుడు మురుగన్ కోరిక మేరకు దీనిని తమిళంలో అందించారు.
ఈ పుస్తకం రమణులవారి బోధనలలో అతి ముఖ్యమైన సేకరణగా పరిగణిస్తారు.

కామెంట్‌లు