ఆనాటి మహిళను కాను నేను...!
ఆ0క్షలు - కట్టు బాట్లలో నలిగి, కుమిలి పోయే... ఆ నా టి మహిళనుకాను,
పుట్ట బోయేది ఆడపిల్లే మో...ఆడ పిల్లే ఐతే... తీ యించేయాలి అనే కర్కష నిర్ణయాలతో నిర్దాక్షిణ్య0గా...
మీరు చేసే భ్రూణ హత్యలకు బలై పోయే ఆ నాటి ఆడపిల్లను కాను..!
నవ్వద్దు , నలుగురిలోకి రావద్దు...చాకలి పద్దులు రాసుకునే చదువు నీకు చాలులే అంటు...,
అన్నిటి లోనూ ఆ0క్షల తో వివక్ష చూపుతూ అణగ ద్రొక్క బడే... ఆ నా టి ఆడ పిల్ల ను కాను నేను...!
కన్యా సుల్కాలకు, వరకట్నాలకు అన్యాయం గా బలై పోయే...
ఆ నా టి ఆడపిల్లను
కానునేను...!
విద్య, ఉద్యోగాలలో....
వివేక, వికాశాలలో...
బరువు, బాధ్యతలలో...
ఇది, అది అన నేల...
అన్ని రంగాల ఆధిక్య తతతో....
ప్రతిభనుచూపే నేటి మహిళను నేను...!
రేపటి తరానికి ఆదర్శముగా...నిలిచేను!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి