]పవిత్ర గ్రంథం బైబిల్ భగవద్గీత
ఖురాన్ లా మెరిసే అంబేద్కర్
అందించిన భారత రాజ్యాంగం
వెలుగులు పంచే సూర్యకిరణం...
ఆకాశమంత విశాల హృదయమున్న
మేధోశిఖరం అందరి ఆత్మీయ బంధువు
బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్
అంబేద్కర్ అందించిన అక్షయపాత్ర...
చట్టసభలో ఆకలి తీర్చే
అమ్మ చేతి గోరుముద్ద...
బడుగు జీవులకు రక్షణ కవచం...
పాలకప్రభువుల చేతిలో రాజదండం...
రాజ్యాంగం మన హక్కుల నిధి..
మనసుల్ని శుద్ధిచేసే పవిత్ర గంగానది...
అంబేద్కర్ దాచిన అక్షరాల నిక్షిప్తభావాలు మట్టిలో దాగిన మణిమాణిక్యాలు వజ్రాలు
కపట రాజకీయ నాయకుల
తీపి మాటలు...తేనె పూసిన కత్తులే...
కుట్రలు పన్నే విషనాగుల వ్యూహలు
చీకటి మార్గాన వేసిన ముళ్ళ కంచెలే...
పాలకుల స్వార్థపూరిత
రాజ్యాంగ సంస్కరణలు
పాలకుండలో విషపు చుక్కలే...
అణగారినవర్గాల
ఆత్మగౌరవ పోరాటాలు
సముద్రంలో కెరటాలై ఉప్పొంగాలి ...
శత్రువులను దహించే అగ్నిజ్వాలగా
యువతలో రాజకీయ చైతన్యం రగలాలి
రాజ్యాధికారమే లక్ష్యంగా
ఓట్ల రామబాణాలు విసరాలి
అంబేద్కర్ ఆశయాలు సిద్దించాలి
అపుడే పున్నమినాటి వెన్నెలవోలె
ఆ మహాత్ముడి పవిత్రాత్మకు శాంతి...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి