సిగ్గుపడాల్సిన మానవత్వం : - నాగలక్ష్మి కుంజా -తెలంగాణ సాహితి భద్రాచలం శాఖ.

 మృగం మానవుడా? రాక్షసి పాపాత్ముడా ?
రక్తాన్ని జర్రే కామపిశాచి మానవుడా?? 
మృగాలకంటే హీనం నీ జన్మ వృధా కాదా?
ఆది మానవుడు మొదలుకొని ఆధునిక జీవనం 
భూ మండలాన్ని చుట్టూ ముట్టే విజ్ఞానం 
అక్షర జ్ఞానం వెలుగులు జిమ్ముతున్న తరుణం 
సృజనాత్మకతో ఉరకలు వేస్తున్న కాలం 
కఠిన కారాగారాలు శిక్షలు వేస్తున్న ఇంతటి విఫలమా?
పసి మొగ్గ ప్రయాణి గుట్టుగా చిది మేస్తే ?
కనికరమే లేక ఘోరంగా చిదిమేస్తే ?
పిల్ల కోడిని వచ్చి డేగ కన్నులే వేటు వేస్తే ?
బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు ఎన్నో ??
ఎన్నాళ్ళు ఇంకా చిత్రహింసలకు గురి యేనా?? 
పసి పాపను వదలరు... ముసలవ్వను వదలరు ...
అడుక్కునే అవ్వను కూడా వదలరు....?
ఆడదైతే చాలా కామం కాటు వేస్తే ఎన్నో 
అఘాత్యాలకు దిక్కులేని మరణము ఆడజన్మే కదా శాపము ?
సృష్టికర్త స్త్రీని మరిచి సిగ్గుపడాల్సిన మానవత్వం? 
తలదించుకునేలా మాలిన్యం ఏమైపోతుంది ??
మానవ నైజం ఎటువైపుకు మల్లాను మానవత్వం???
ఎన్నో అఘాయిత్యాలుకు దిక్కులేని మరణము.
                           
                               
కామెంట్‌లు