* గిజి గాడి గూడు *: - కోరాడ నరసింహా రావు
ఈ సృష్టిలో ఆ సర్వేశ్ వారుడు... 
  ఏ ప్రాణికి ఇవ్వ వలసిన జ్ఞానాన్ని , ఆ ప్రాణికి ఇచ్చా డు...! 

క్రిమి, కీటక , పశు, పక్ష్యాది  సమస్త జంతు జాలమునకు...నరులతో సహా...
 వాటి వాటి అవసరాలకు సరిపడ జ్ఞానాన్ని వాటి వాటికి దయతో అనుగ్ర హించాడు ఆ పరమాత్మ ! 

ఇందులో నరులే గొప్ప తెలి వైన వారు... అని పిం చు కోవచ్చు...! 

ఏ ప్రాణి తెలివి తేటలు ఆ ప్రాణివి...!! 

మనిషి తన అవసరాలను  మించి , తన తెలివి తేటలతో ఎంత ఎత్తుకు ఎదిగిన... 
  నిజానికి పశువులు,ఖగ,మ్రుగములే...ఉత్తమ మైనవి...! 

ఆ పక్షి తన గూడునుచూ డండి ఎంత ఓర్పుతో... నేర్పుగా తన నివాసాన్నిఎంత చక్కగా నిర్మించు కుంటు0దో..!! 

మనిషి ఇంత కంటే గొప్ప నై పుణ్యాన్ని చూపించ వచ్చు...
గాని, మనిషి స్వా ర్ధ పరుడు... తన సుఖం కోసం... ఇతరులను దుఃఖ పెట్టటమే కాదు...
 సర్వ నాశనానికి కూడ తెగ బడతాడు...! 
   అందుకే.... సర్వ శ్రేష్టు డైన మనిషి  పశువుల కన్న చులకనై పోయాడు!! 
       *****

కామెంట్‌లు