సకలమూ నీవే
సర్వమూ నీవే
సాయుజ్యము నీ కడకే
ప్రాణమూ నీవే
పరమాత్మవూ నీవే
ఆనందమూ నీవే
ఆద్యంతరహితుడవూ నీవే
హరా అనినంతనే
అగుపించెదవు
అభిషేకాలు చేసినంతనే
సంతృప్తి పడెదవు
భక్తసులభుడవు నీవు
కామదహనమొనరించి
కైవల్యమునిచ్చుదువు నీవు
పరమేశ్వరా!కైలాసవాసా!
పాహి!పాహి!శంభోశివశంకరా!
దక్షయజ్ఞ ధ్వంసము చేసి
సతీదేవి దాక్షాయణిని దరిచేర్చినావు
మహాకాలుడిగా మహేశ్వర నామధేయుడిగా నీ నామమే
త్ర్యయంబకమై నిలిపినావు.
పంచాక్షరీ మంత్ర శక్తివై
పరమార్థమును పరచినావు.
నీ ఆజ్ఞ లేనిదే జగత్తు కదలదయ్యె
భక్తికి,ముక్తికి ఆటపట్టై వెలసినావు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి