ఆంధ్రమహిళాసభ వెన్నెముక, ఆదర్శ విద్యాలక్ష్మి బాల్యం(మేడం బి.ఇడి.కాలేజీ ప్రిన్స్ పాల్ గా నాకు పరిచయం! ఆపై ఆమెనుంచి అమూల్యమైన ఆమె బాల్య విశేషాలు చెప్తే రాసుకున్నాను.
"నాబాల్యం అందమైన పూలతోట,దుర్గాబాయ్ దేశ్ముఖ్ వేశారు రాజబాట. మానాన్న మంగాచార్యులుమద్రాస్ హైకోర్ట్ లో లాయర్.అమ్మ కనకవల్లి ఇంట్లో మాతో పాటు బంధువుల పిల్లలకి రోజూ పాతిక మందిదాకా వండి ఆప్యాయంగా తిన్పించిన బాల్యం.ఆరోజుల్లో మద్రాస్ ఆంధ్ర బాలానందసంఘంలో రేడియో అక్కయ్య అన్నయ్య న్యాపతి కామేశ్వరి,రాఘవరావు వల్ల బాలలప్రోగ్రాంలలో పాల్గొన్నాను. పుట్టిన రోజు జేజేలు చెప్పి చాక్లెట్లు పంచేవారు రేడియోస్టేషన్ లోనే.మాఅమ్మ కి13,నాన్నకి17వ ఏటపెళ్లి ఐంది.అమ్మ ది విజయనగరం,నాన్న ది జగ్గంపేట! శారదాయాక్ట్ ఉన్న రోజులవి. మద్రాస్ లో నాన్న లా చదివి హైకోర్ట్ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో నేనుబెసెంట్ థియోసాఫికల్ సొసైటీ అడయార్ స్కూల్లో 5వతరగతి చదివాను.నాఫ్రెండ్స్ సినీనటి కాంచన, నీలం సంజీవరెడ్డిగారి కుమార్తెలు నిర్మల,నీరజ, నర్మద. నాకు పెద్ద జుట్టుండేది. డాన్స్ డ్రామాలు ఆటపాటలతో ఉత్సాహపూరిత బాల్యం.నేనెప్పుడూ క్లాస్ ఫస్ట్.లెక్కల్లో బెస్ట్ ఫస్ట్.మానాన్న గారి ఫ్రెండ్ దుర్గాబాయి గారు లాయర్ మా ఇంటికొచ్చేవారు.నన్ను బెనారస్ మెట్రిక్ కి తయారు చేశారు.ఆరోజుల్లో వితంతువులైన యువతులను దుర్గాబాయి చేరదీశారు.20_25ఏళ్ల వయస్సున్న వారితో మాపిల్లల్ని కలిసి వారిలో నూతనోత్సాహం కల్గించారు.అలా బెనారస్ మెట్రిక్ పరీక్ష కోసం ఓపాతికమంది ఆడపిల్లలం 1953- 54లో యూనివర్సిటీ హాస్టల్ లో ఉన్నాం.అప్పుడు నారూంమేట్ యువతి మద్ది స్వరాజ్యలక్ష్మి గారు.ఆమెకి నా ఆంగ్ల భాషా పరిజ్ఞానంతో చదువు చెప్పి పరీక్షకు సిద్ధం చేశాను.నాకు రెండు జడలేసేవారు , .ఆమెనాతో మెట్రిక్ పాసైనారు.తమాషా ఏమంటే ఆమె బి.ఇడి ఆంధ్రమహిళాసభ లో చేశారు.అప్పుడు నేను ప్రిన్స్ పాల్ ని. అలాగే లాజిక్ లెక్చెరర్ పార్వతిగారు1975- _78కాలంలో బి.ఇడి.స్టూడెంట్ గా నాదగ్గరకు రావటం.ఆఇద్దరికి నేను స్టూడెంట్ ని కాలేజీలో! కానీ బి.ఇడి.కాలేజీ ప్రిన్స్ పాల్ గానేను!! కలలో కూడా అనుకోని సంఘటనలు కదూ?ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడగానే గుంటూరు హైకోర్ట్ కి నాన్నగారు రావడం నేను గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో చేరటం ఆపై,హైదరాబాద్లో హైకోర్ట్ లో నాన్న లాయర్ కావటంతో కుటుంబం అంతా స్థిరపడ్డాం. " ఆఖరున లక్ష్మీ మేడం నా కు ఇచ్చిన సందేశం ఏమంటే"మనం పిల్లలకి చదువు మార్కులకు. మార్కులకోసం చెప్పకాక ఆలోచన లతో కొత్త భావాన్నిరేకెత్తించాలి.మనపని తో ఎలాంటి ప్రభావం పడుతుందని ఆలోచించాలి.చిల్లికుండ కారాదు చదువు.ఉట్టి అన్నం పెడితే సరిపోదు.దానికి కావల్సిన ఆధరువులు వడ్డించాలి." ఆనాటి చదువులకు ఈనాటి చదువులకు తేడా చెప్పిన ఆవిద్యాలక్ష్మికి నమోవాకాలు🙏

Thank you so much for sharing
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి