గుంటూరులో కవి గద్వాల సోమన్న "పూలవాన" పుస్తకావిష్కరణ

 నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న పూలవాన పుస్తకావిష్కరణతో పాటు మమతల కోవెల, గిజిగాని గూడు, పాలపిట్ట పుస్తకాల పరిచయ సభ గుంటూరులో ఘనంగా జరిగింది. పద్మావతి వేదిక, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం,బృందవన్ గార్డెన్స్, గుంటూరులో  పాలపిట్ట,గిజిగాని గూడు  మమతల కోవెల, పూల వాన ఆ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మాధవ స్వామి, ప్రముఖుల చేతుల మీదగా ఆవిష్కరించారు. అనంతరం ఈ పుస్తకాలను సేవారత్న శ్రీ పలకలూరి శివరావు గారికి అంకితం చేశారు.ఒకే వేదిక, ఒకే రచయిత, ఒకే వ్యక్తి కి అంకితమిచ్చి ఆవిష్కరించడం అరుదైన ఘటన.పిదప బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అతిరథ మహారథులు, పాత్రికేయ మిత్రులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు