.చిత్ర స్పందన : - ... కోరాడ !
చదువు ఈడు బాల.... 
 చెరువు ప్రక్క , బురద గుమ్మిలో 
    చేపలను కొన్నిటిని
తెలివిగా పట్టింది ! 

పట్టిన చేపలను బుట్టలో వేసుకుని... 
  అమ్మ జూపుతు తాను  ఇల్లిల్లు తిరిగెనో యేమో! 

చేప లన్ని సక్కగ చెల్లిపొతేనే... 
 ఇంటిల్లి పాదికీ కూడు దొరికే నేమో...!! 

మోమున చిరు నవ్వు చెదరక
    పూర్తిగా అమ్ముడు పోయేవరకు.... 
  పట్టువదలని విక్రమార్కు  డవునో... యే మో....!! 
       *****


కామెంట్‌లు