నేనున్నానుగా: - - యామిజాల జగదీశ్
 నీకు నేను ఉన్నాను అనే మాట ఓ భరోసా. అది ఎంత శక్తిమంతమైనదో తెలుసా? 
ఒక తండ్రి తన కొడుకుకి ఈత నేర్పించడానికి కొలువుకు తీసుకెళ్తాడు. తండ్రి నీటిలో నిల్చుని గట్టుమీదున్న కొడుకుతో "నాన్నా, నేనిక్కడ ఉన్నాను. నీటిలోకి దూకు పడండి" అని అంటాడు.
ఆ మాటతో కొడుకు ఏ భయమూ లేకుండా నీటిలోకి దూకుతాడు. ఎందుకంటే తన తండ్రి అక్కడ ఉన్నాడని అతను నమ్ముతాడు.
అమ్మ కూడా నిద్రపోతోంది. 
కొడుకు భయంకరమైన కల కని, "అమ్మా" అని అరుస్తూ మేల్కొంటాడు.
"ఏమైందిరా?" అని తల్లి అడిగినప్పుడు "నాకు భయంకరమైన కల వచ్చింది" అని చెప్తాడు కొడుకు. అంతట తల్లి "భయపడకురా, నేను నీ పక్కనే ఉన్నాను" అని చెప్పినప్పుడు, కొడుకు తన తల్లిని కౌగిలించుకుని భయం లేకుండా నిద్రపోతాడు.
చెల్లి సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్న కొత్తలో "అన్నయ్యా, "నేను పడిపోతానురా.... నువ్వు సైకిల్ పట్టుకో" అని అంటుంది. అప్పుడు అన్న "భయపడకు రా" అని చెప్పి నమ్మకం కల్గిస్తాడు. వెంటనే అలాగే అన్నయ్య అంటూ అతనిని నమ్మి సైకిల్ తొక్కుతుంది.
ఏదో కారణంతో భర్త ఉద్యోగం పోగొట్టుకుని ఆందోళన చెందుతుంటాడు. అప్పుడు భార్య, "మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? నేను మీకున్నాను" గా అంటుంది. ఆ మాట అతనికిచ్చే భరోసా అనుకోండి ధీమా అనుకోండి  అతని ఆందోళన పోతుంది.
ఒక విద్యార్థి తన గురువుతో, "గురువుగారూ నేను ఇబ్బందుల్లో పడతానేమో అని భయపడుతున్నాను" అని తన ఆందోళనను వ్యక్తం చేస్తాడు. 
అప్పుడు మాష్టారు "చింతించకు రా. నేనిక్కడ ఉన్నాను" అని అంటారు.  "నీకు అర్థమయ్యే విధంగా నేను పాఠం నేర్పుతాను" అని అంటాడు.
ఆ విద్యార్థి కూడా చదువుకుని ఉత్తీర్ణుడయ్యాడు.
అదేవిధంగా, కష్టమైన పని వచ్చినప్పుడు, మన ఉన్నతాధికారులు "బాధపడిపోకు...ఒత్తిడి పడక... నేను ఇక్కడ ఉన్నాను" అని చెబుతారు. అప్పుడు మనం ఆత్మవిశ్వాసాన్ని పొందుతాం.
అదేవిధంగా, మీ స్నేహితులు లేదా స్నేహితురాళ్ళు ఎవరైనా నిరాశకు గురైనప్పుడు, "నేను ఇక్కడ ఉన్నాను" అని చెప్పండి. మీ మాటలు వారికి ఊతకర్రగా ఉంటాయి.
అందుకే అంటున్నాను...
"నేను ఇక్కడ ఉన్నాను" అనే మాట కేవలం మాట కాదు. అది శక్తిమంతమైన మాట.
మీ జీవితంలో "నేను ఇక్కడ ఉన్నాను" అని చెప్పే ఎవరైనా ఉంటే, అది దేవుని నుండి వచ్చిన బహుమతిగా భావించాలి.

కామెంట్‌లు