నిత్య భావ స్రవంతి: - సి.హెచ్.ప్రతాప్

ఆత్మ

నిశ్శబ్ద నివాసం ఆత్మ
శరీరానికి సారథి ఆత్మ
కాలాన్ని దాటే ఆత్మ
బంధనాలతీతం ఆత్మ
వేదనకు సాక్షి ఆత్మ
ప్రశ్నలకు జవాబు ఆత్మ
అహంకారానికి అతీతం ఆత్మ
సత్యానికి నివాసం ఆత్మ
జనన మరణాలకు అతీతం ఆత్మ
లోపలి దీపం ఆత్మ
మౌన భాష ఆత్మ
శాశ్వత ప్రయాణం ఆత్మ

 స్వప్నం

నిద్రలో పయనం స్వప్నం
మనసుకు చిత్రం స్వప్నం
ఆశల ఆకారం స్వప్నం
అసాధ్య సాధన స్వప్నం
చీకటిలో వెలుగు స్వప్నం
భయాలను చెరిపే స్వప్నం
నిన్నటిని మరిచే స్వప్నం
రేపటిని కూర్చే స్వప్నం
వాస్తవానికి విత్తనం స్వప్నం
జీవితానికి దిశ స్వప్నం
కళ్లలో ప్రపంచం స్వప్నం
మనిషిని నడిపే స్వప్నం 
కామెంట్‌లు