కమ్యూనికేషన్!!:-డా ప్రతాప్ కౌటిళ్యా.
మనం
అంతరిక్షంలో లేం 
అంటార్కిటికాలో లేం
థార్ ఎడారిలో లేం..!!?

అందుబాటులోనే ఉన్నాం 
స్టేషన్లోనే ఉన్నాం 
కమ్యూనికేషన్ లోనే ఉన్నాం !!

మనకు 
ఎగరటానికి రెక్కలు లేవు 
వాలిపోవడానికి చెట్లు లేవు 

మనం 
విసర్వేయబడ్డ విత్తనాలం
మొలకెత్తాలనుకుంటున్నాం!!

మనకు 
ఒక సూర్యుడు కావాలి 
మనకింత భూమి కావాలి 
మనకిన్ని నీళ్లు కావాలి..!!?

డా ప్రతాప్ కౌటిళ్యా 
నాగర్ కర్నూల్ జిల్లా పాలెం.

కామెంట్‌లు