డబ్బు బందిలో బదుత్వాలు : - ఈగపాటి రంజాన్ -భద్రాద్రి కొత్తగూడెం
 నాకు ఇంకా యాదుంది 
మానయనా కష్టంతో సోపతి చేస్తుండే 
అప్పుడు నాకు ఊహ తెలిసీ మా మనసులకు
 పరిచయం కాని బంధువులు మస్తుగుండే...
పొట్ట సేత బట్టుకొని ఊరు వలస ఒచ్చిన 
మా అమ్మ నాయన అనుబంధపూ
 బ్రతుకు బండిని లాక్కెళ్తుంటే 
మా కంటికి కనిపించలేదు మా చెవికి 
వినిపించలేదు ఏ చుట్టపు అనుబంధాలు 
కనరాని తోబుట్టువుల నవ్వుల బువ్వలు..
బహుశా మా నాయన పేదరికపు చుట్టం అని కాబోలు 
కష్టాన్ని ఇష్టపడిన మా నాయనకు 
దేవుడు వరం ఇచ్చిండు కాబోలు ఉద్యోగ సోపతి 
పట్టిన నాయనకు బంధువులు బంధుత్వాలు 
ఉపిరి పోసుకున్నాయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ 
గౌరవించడమే తెలిసిన మా అమ్మ నాయన నేటి సమాజంలో 
మనిషి డబ్బు పదవి అధికారం ఉన్నప్పుడు అనుబంధాలు 
అనురాగాలు సేనుకు కంచాల కనిపిస్తాయి 
అంటూ మా అమ్మ నాయన మీము చదవని
 జీవిత పాఠాలు చెబుతూ మమ్మల్ని 
మార్గదర్శకులుగా తీర్చి దిద్దిన
 నా మొదటి దైవాలకు పాదాభివందనాలు...!!

కామెంట్‌లు