సంభవామి యుగే యుగే !అచ్యుతుని రాజ్యశ్రీ

 "నాయనా! ఏంటంత విచారంగా ఉన్నావు? బౌద్ధమతం అనుసరించి మంచి మార్గంలో నడిచావు. సాహిత్యంలో నేను నీవు సానుభూతికి నోచుకున్నాం! మరెందుకంత మథన,మల్లగుల్లాలు పడుతున్నావు నాయనా?" తల్లి యశోధర ప్రశ్నకు రాహులుడిచ్చిన జవాబిది" అమ్మా! తండ్రి మొహం ఎరగను.నేను భూమిమీద పడగానే విరక్తితో పచ్చిబాలింతవైన నిన్ను,నామొహం చూడకుండా నాన్న రాజ్యం వదిలి బుద్ధుడైనాడు. ప్రపంచ ప్రసిద్ధుడైనాడు.కానీ ఈకాలంలో నా పేరు పెట్టుకున్నవారుఅడ్డదిడ్డమైన పనులు మాటలతో దేశానికి అపఖ్యాతి తెస్తున్నారు.నాపేరు ఇలా వక్రంగా  అన్యాయంగా మారుమోగటం నాకు బాధ కలిగిస్తోంది అమ్మా!"
"మరి కలియుగం నాయనా! రావణుని దుర్యోధనుని పూజించే కాలం!కలికాలం, భారత దేశం అనాదిగా అనైక్యతతో భద్రం ఛిద్రం! గొంగట్లో కూర్చుని వెంట్రుకలేరే తత్వం!కలియుగం మరి! సంభవామి యుగే యుగే అన్న భగవానుడు దిగివచ్చు,నీ సందేహాల్ని తీర్చు,సరేనా!?"🌹
కామెంట్‌లు