సూర్యుణ్ణి పగలగొట్టిన నది
మేఘాల్ని విడగొట్టిన గాలి
కాంతిని కదలకుండా ఆపిన కడలి
నీడల్ని కలిపిన అద్దం!!
మాటల్ని తిన్న చిలుకలు
గోడల్ని పడగొట్టిన చీకటి
గుణాల్ని తవ్విన గుణపాలు
ఎండమావులు తోడిన సూర్యుడు!!
నీళ్లను నిద్రపుచ్చిన చెరువు
కన్నీళ్ళలో కొట్టుకుపోతున్న కలలు
రెక్కలు రాలిన చెట్లు
ఆకులు తొడిగిన ఆకాశం!!
ముక్కలైన నక్షత్రాలు
చుక్కలైన అందం
ఎగురలేని పక్షి
గురితప్పిన బాణం!!
విరబూసిన జాబిల్లి.
మలిన మంటని చోటు
మన కంఠం.
పవిత్ర ప్రతులు
పెదవి దాటని మాటలు.
స్వరం కోల్పోయిన మౌనం
పుస్తకం.
కాలిపోని కంచుకోట
మన మనసు.
ఆయుధం ధరించని ఆయుధం
అయస్కాంతం.
అందరినీ ఆకర్షించే అయస్కాంతం
ఆడపిల్ల.
ఎవరు చెప్పినా వినని యుద్ధం
ఎవరు ఆపినా ఆగని యుద్ధం-ప్రేమ!!
డా ప్రతాప్ కౌటిళ్యా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి