సమాజహిత కథలు చిరస్మరణీయం రచయిత అయ్యలసోమయాజుల

   ప్రముఖ సాహితీ సంస్థ సహృదయ సాహితీ విశాఖపట్నం లోని ప్రిజం కళాశాలలో నిర్వహించిన కథాకచేరిలో కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ సమాజాహిత కథలే ప్రజల హృదయాలలో చిరకాలం నిలిచి ఉంటాయని చెబుతు' ఓహో ఈ రోజు మా దినమా' అన్న బహుమతి పొందిన కథను   వివరించారు. విశిష్ట అతిథిగా సాహితీవేత్త డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు, విశ్లేషకులు కవి డాక్టర్ కె. జి వేణు కథకులు శ్రీమతి దామరాజు విశాలాక్షి, గజల్ జ్యోతిర్మయి, చిట్టెల్ల నిర్మల ,భాగవతుల సత్యనారాయణ, వేదుల వాసుదేవరావు  చిన సూర్యనారాయణ మరియు సాహితీ ప్రియులు పాల్గొన్నారు. వ్యవస్థాపకులు శేఖరమంత్రి ప్రభాకర్ ఆధ్వర్యంలో సభ దిగ్విజయంగా జరిగింది..!!
............................
కామెంట్‌లు