ఈర్ష్యా సూయలు ! : - కోరాడ నరసింహా రావు !
ఎదుటి వ్యక్తిని గౌర విం చాలంటే ,ఉత్తమ సంస్కా రముండాలి...! 
   నేనే గొప్ప, అనుకునే అహంకారపు మదంలో ఉన్న వారికి..., 
  ఉచ్చము  నీచము  గౌర వము,మర్యాద తెలియవు...! 
     దీనంతటికీ మూలం... 
అపరిమిత మైన ఈర్ష్యా సూయలు ! 
  అవి మనిషి లోని విచక్షణను చ0పెస్తాయి ! 
 వివేకాన్ని నాశనంచేసేస్తాయి...!! 

ఐనా... సజ్జను లెవరైనా ఇలాటివాటిని పట్టించుకుంటారా...!? 

రసజ్ఞత లేని వారి కు విమర్శలను పట్టించుకుంటారా...?! 
   వారి సదాచారాన్ని విరమించుకుంటారా...
   
కుక్కలున్న వీధిలో  విహరించే ఏనుగు... ఓర్వలేని కొన్ని కుక్కల అరుపులను పట్టించు కుంటుందా...! 



కుక్క గుణం కుక్కదే... 
  యెనుగు లక్షణం ఏనుగు దేగా...! 
       ******


కామెంట్‌లు