శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే !శివస్య హృదయం విష్ణు: విష్ణోస్య హృదయం శివః!.అని సంధ్యావందనాదిఅనేక నిత్యకర్మలలోస్థితి లయకారకుల మధ్యఅభేదం లేదని అనేక మహనీయులు, మంత్ర ద్రష్టలుఅనాదిగా చెబుతున్నారుజీవన్ముక్తి నిచ్చే విష్ణు సహస్ర నామస్తోత్రంలో కూడాఈశ్వర ఉవాచ అని పార్వతీమాతకుమోక్షప్రదానమయినతారకమంత్రం'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమేసహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే' అని చెప్పారు.విపత్కర పరిస్థితులలో ధర్మ పరిరక్షణ కొరకైసాక్షాత్తు పరమేశ్వర ప్రతిరూపమైనఆది శంకరాచార్యఅద్వైత వేదాంతాన్ని పునరిద్ధించి'బ్రహ్మ సత్యం, జగన్మిమిధ్య బ్రహ్మైవ నా పరః 'అనిదేశంలో నాలుగు ధర్మ పీఠాలను స్థాపించిసౌందర్యలహరివివేకా చూడామణి,శివానందలహరి ,బ్రహ్మసూత్రాలకు ఉపనిషత్తులుభగవద్గీతకు వ్యాఖ్యానాలను వ్రాసినాస్తికత్వాన్ని రూపుమాపి షణ్మత స్థాపన చేసిశివ, విష్ణు, శక్తి, గణపతి, సూర్య ,కుమారస్వామిఆరాధనను క్రమబద్ధీకరణ చేసిన మహాత్ములునేడు మతమార్పిడులు జరుగుతున్న సమయంలోసనాతన ధర్మమే వసుదైకానికి ఆదర్శమనిధర్మపరిరక్షణ చేస్తున్న పీఠాధిపతులు,స్వాములుశివకేశవుల మధ్య భేదం చూపుటసమంజసమా?విజ్ఞులు,ప్రాజ్ఞులు ఆలోచించండి'ధర్మో రక్షతి రక్షితః' అన్నది పాటించిసమాజ కల్యాణానికి పూనుకుందాం...!!లోకా సమస్తా సుఖినో భవంతు.............................
శివకేశవులకు అభేదమా ?: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి