సాధారణ పల్లె పడుచులో
ఆసాధారణ కళా కాంతులు...!
అలంకారాలేవీలేక పోయినా...
ఆమె సహజ సుందర రూపమే...
ఆమెకు అందాల అలంకరణ...!!
రక్షణ కొరకు ఆమె ఎవరి పైనా ఆధార పడ పనిలేదు...!
స్వీయ రక్షణ దండము చెంతనే ఉంది...!!
ఆమె తలపులలో మెదలుచున్న ఆ భావా లేమో....,
ఆ ఓర చూపుల చిరు దరహాసమునకర్ధమేమో..
అవి వయసు తెచ్చిన ఊ సు లే మో...!!
ఏ ది ఏ మైనా... ఆమె నిన్నటి అబల కాదు గా..!
నేటి సబల...!!
రేపటి మేటి మహిళ..!!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి