పొద్దు పొడవక ముందే
మొద్దు నిదుర వీడి
ముద్దు ముద్దు పువ్వుల
సుద్దులు వినే అదృష్టం!
చిన్ని ఆకుల మీద
ప్రత్యూష సమయాన
నిలిచిన మంచు ముత్యాల
మాల గుచ్చు ముచ్చట!
చెంగు చెంగున గెంతు
తువ్వాయిల మె డలోని
చిన్ని గంటల సవ్వడి వింటూ
వెంట పరుగులు తీసే సంతోషము
హాయిగా చుట్టేసి పలకరించు
కొండగాలి నిండు మనసుతో
తెచ్చు గంధపు పరిమళము
గుండె నింపుకునే సంబరము
చేతికి అందేలా సాగు
పొగమంచు మేఘాలు
అందుకోవాలని చూచు
అల్లరి ఆనందం
ఇన్ని సరదాలు తీర్చు
చిన్ని పల్లె అందాలకు
ఎన్నో వన్నెలు అద్ది
అలరించు వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి