అవినా భావం ! - కోరాడ నరసింహా రావు.
  కని, పెంచిన తల్లి,కార్చే కన్నీరు బిడ్డ మనసును కదిలించి...కరిగించింది ! 

తనను నవ మాసాలూ... మోసిన తల్లి.... 
  తనను కనటానికి ఆమె ప్రాణాలను సైతం లెక్క చెయ్యని తల్లి.... 
   తనకోసం,  అన్ని బాధలను ఆనందముగా అనుభవించిన తల్లి... 
   ఇప్పుడిలా మౌనంగా మనో వేదన ననుభవిస్తూ
  తన హృదయం ఎంత తపించక పోతె... 
   ఇలా ఈ కన్నీటిని స్రవిస్తుంది....!? 

తన చిట్టి చేతుల కంటి తుడుపే.... 
  ఆ తల్లి మనసుకు అంతు లేని ఉప సమన! 

బిడ్డ చూపించే ప్రేమే... 
  తల్లి గుండె గాయానికి అద్భుత మైన లేపనం !! 

బిడ్డ చేతి స్పర్శను మించి న ఓదార్పు తల్లికి వే రే ముంటు0ది...?! 

తనువులు వేరైనా.... తల్లి, బిడ్డల రక్తం ఒకటే! 
  గమనిస్తే... హృదయ స్పందనలూ ఒకే తీరు !! 

తల్లి స్పర్శ బిడ్డకి... బిడ్డ స్పర్శ తల్లికి ఎనలేని ఆనందం...! 
   అంతులేని తృప్తి...!! 

మనుషులు ఎదిగే కొద్ది... 
  బిడ్డల మనసులు తరిగి పోవచ్చు...! 
  తల్లి ప్రేమ యింకా యింకా పెరుగుతుందే తప్ప తరగదు కదా...!! 
 తల్లి మమకారానురాగాలే... 
 అంత గొప్పవి...! 
  అంతగా బిడ్డను ప్రేమిస్తుంది కనుకనే... 
  బిడ్డ చేతి స్పర్శకు అంత  ఉపసమనాన్ని పొందు తుంది....! 
 బాల్యములో బిడ్డకు అమ్మ స్పర్శ స్వర్గ సుఖమే ! 
  గాని జీవి తాంతము తల్లికి బిడ్డ స్పర్శలో ఒకే అనుభూతి , ఒకే ఆనందము...!! 
      ******

కామెంట్‌లు