అమ్మ పాద పూజ: - డా. సి వసుంధర,-చెన్నై
అమ్మకు చేద్దాం
అక్షర సుమాలతో
సులక్షణా సారభరిత చంపక,  
ఉత్ఫల మాలలల్లి 
కంద కుసుమములు
అందముగా కను విందు 
సేయ ఉంచుదము అమ్మ ఆడుగుల
క్రింద మృదుత్వ మమర.

తెలుగుతల్లి అలిసినది, పరాయిభాషల
బడాయిబాధింపగా
 తన భాషా చతురత గతితప్పీ
మౌన ముద్ర దాల్చి
మూగ వేదనచెందుఅమ్మనారాధించి,
నేడు ఏడేడు లోకాల పూజలందించే ము
భక్తి కుంకుమ, శ్రద్ధ హరిద్రము (పసుపు)వాక్సు
ద్దితో పరిశుద్ధ
మాతృభాషాభావన, అన్ని కొనిపోయి 
తెలుగుభాషామ
తల్లిని  పూజింతము 

వెలుగులు చిమ్మే అమ్మకు
 కమ్మని 
కైతల కుసుమాలు
ఘుమ్మని 
కావ్య మధులిహముల (తుమ్మెద)
గీతాలు, అది ఇది 
ఆననేల
 తల్లిభాషకు ఉ ల్లము ఘల్లు మనగా  
అంతర్జాతీయవేదికపై ఆ తల్లికీర్తి
 రత్న కిరీటము కాగా రాసేదము
పాడేదము
 హిమవన్నగము
తెలుగుతల్లి కీర్తి శాశ్వతము.

కామెంట్‌లు