ప్రయాణం : - జయా
ఎంత పెద్ద బండరాయైనా
కావచ్చు
దానిని ముక్కలు చేయడానికి
ఒక చిన్న ఉలి చాలు . 

ఎంత పెద్ద బలవంతుడైనా 
కావచ్చు
అతనిని దెబ్బతీయడానికి 
ఒక చిన్న మాట చాలు

మీ మాటలు ఎవరి మనసునీ 
నొప్పించకూడదు

మనసు అద్దంలాంటిది
ఒకసారి ముక్కలైతే 
అవి తిరిగి అంటవు

మీ తల్లితండ్రులు
మీకు మంచి మాటలు చెప్తే
వినండి
నిర్లక్ష్య ధోరణి తగదు
"నామీద నమ్మకం లేదా" అని
వారిని ఎదురు ప్రశ్నించకండి

మీరడిగిన ప్రశ్నకు
జవాబు చెప్పడం మొదలుపెడితే 
ఆ మాటలు
మీరు తాగిన తల్లిపాలు 
బయటకు వచ్చేలా ఉంటాయి 

మన కన్నోళ్ళు
మనం మంచి మార్గంలో 
వెళ్ళాలనే చెప్తారు తప్ప
తప్పుడు మార్గంలో వెళ్ళమనరు 

ఇది అర్థం చేసుకుని
పయనిస్తే
మీ ప్రయాణం 
ఉన్నతంగా ఉంటుంది
లేకుంటే
నీ ప్రయాణం అర్థాంతరంగా
మధ్యలోనే ఆగిపోతుంది


కామెంట్‌లు